తాళ్లూరు మండలంలోని 16 గ్రామపంచాయతీలందు ఎన్ఆర్ఈ జిఎస్ నిధులలో సీసీ రోడ్లు, సైడు కాలువ నిర్మాణాలకు 58 పనులకుగాను రూ3 కోట్ల నిధులు మంజూరయినట్లు ఎంపీపీతాటికొండ శ్రీనివాసరావు, మండల. టీడీపీ అధ్యక్షులు బి.ఓబుల్ రెడ్డిలు ఆదివారం తెలిపారు. గ్రామాల్లో సీసీరోడ్లు, సైడు కాలవలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దర్శినియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి దృష్టికి తీసుక వెళ్లగా మండలోని అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు, సైడు కాలువల నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేశారని తెలిపారు. మండలం లోని బెల్లంకొండవారిపాలెంలో 3 పనులకు రూ.15 లక్షలు, బొద్దికూరపాడులో 4పను లకు రూ .20 లక్షలు, దోసకాయలపాడులో 3పనులకు రూ.15 లక్షలు, తూర్పుగంగవరం లో 5పనులకు రూ.25లక్షలు, కొర్రపాటివారిపాలెంలో 3పనులకు రూ .15లక్షలు,లక్కవ రంలో 4పనులకు రూ.30లక్షలు, మాధవరంలో 4 పనులకు రూ.20లక్షలు, మల్కాపురంలో 2 పనులకు రూ.10లక్షలు, మన్నేపల్లి 3పనులకు రూ.15 లక్షలు,నాగంబొట్ల పాలెంలో 4పనులకు రూ.20లక్షలు, రామభద్రాపురంలో 2పనులకు రూ .10లక్షలు, శివరాంపురంలో 3పనులకు రూ .15లక్షలు, తాళ్లూరులో 4 పనులకు రూ.20లక్షలు, తురకపాలెంలో 6 పనులకు రూ30లక్షలు, వెలుగువారిపాలెంలో 4 పనులకు రూ 20ల క్షలు, విఠలాపురంలో 4పనులకురూ.20లక్షలు మంజూరయినట్లు తెలిపారు.గ్రామాల్లో ఎన్ఆర్ఆజిఎస్ కింద మంజూరైన పనులు పంచాయతీ రాజ్ శాఖ పర్యవేక్షణలోజరుగుతాయన్నారు. మండల అభివృద్ధికి చేయూత నిస్తూ రూ3కోట్ల నిధులు మం జూరుకు కృషి చేసిన దర్శి టీడీపీ ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు.
తాళ్లూరు మండలంలో సీసీరోడ్లు, సైడు కాలువ నిర్మాణాలకు 58 పనులకు రూ.3కోట్ల నిధులు మంజూరు
29
Sep