అద్దంకి డిపో నుండి శ్రీశైలం బస్సు ముండ్లమూరు, తాళ్లూరు, బొద్దికూరపాడు, రాజంపల్లి, పొదిలి మీదుగా గత రెండు నెలల నుండి నడపటంతో పలు గ్రామాల ప్రజలు ఎంతో హర్షించారు. సాక్షాత్తు మల్లన్న స్వామి తమకు బస్సును ఏర్పాటు చేయించారు అంత ఆనందంతో ఏర్పాటు చేసిన బస్సు సర్వీస్ కు హారతులు, దండలు వేసి స్వాగతం పలికారు. అయితే వారి ఆనందరం రెండు నెలల గడచిన పిదప ఆవిరయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. రెగ్యులర్ గా కాక గత ఐదు రోజుల నుండి రాక పోవటంతో ప్రజలు ఆందోళనకు గురైనారు. అయితే ఆదివారం బస్సు రావటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తి గత వాహనాలు పెరిగిన సమయంలో… బస్సు ప్రారంభం అయి రెండు నెలలు అవుతున్నా అక్యుపెన్సీ పెరగక పోతుండటంతో ఆర్టీసీ అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు బస్సు సమయాలను తెలుసుకుని వినియోగించుకోవాలని ఆర్టీసీ ఉద్యోగులు సైతం కోరుతున్నారు.

