మానవత స్వచ్ఛంద సేవా సంస్థ దర్శి శాఖను వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ రామచంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ ఆశయాలు వివరించారు. అనంతరం సంస్థ నూతన కమిటీలు నియమించి, కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. డైరెక్టర్స్ కమిటీ చైర్మన్ గా దేవత వరప్రసాద్, వైస్ చైర్మన్ గా వాకా జనార్దన్ రెడ్డి, కన్వీనర్ గా కపురం శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులుగా ధనిరెడ్డి వెంకటరెడ్డి, సెక్రటరీగా అడపాల గణేష్, ట్రెజరర్ గా గొర్రెపాటి వేణు నియమితులయ్యారు. అడ్వైజరీ కమిటీ, శాంతి కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పురప్రముఖులు, విద్యావంతులు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.

