దేవీ నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పలు ఆలయాల నుండి ఆహ్వానాలు అందజేశారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో అమీర్ పేట లోని శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం, ఎస్ ఆర్ టి లోని వినాయక స్వామి దేవాలయం, బేగంపేట లోని కట్ట మైసమ్మ దేవాలయం ఈ ఓ ల ఆధ్వర్యంలో కలిసి ఆహ్వానాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఓ లు వంగా అంబుజ, నరేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఫౌండర్ చైర్మన్ లు చెక్కల సుభాష్ ముదిరాజ్ ,మల్లిఖార్జునప్ప, తదితరులు పాల్గొన్నారు.

