ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచెయ్యాలి. – అభివృద్ధికి సహకరిస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు – ఎంపీపీ తాటికొండ -తాళ్లూరు మండలసర్వసభ్యసమావేశం నిర్వహణ

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల మౌళిక వసతుల అభివృద్ధికి కృషి చెయ్యాలని తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ తాటికొండ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ గత ప్రభుత్వం వలే కాకుండా అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చేయటానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అందువలన గ్రామాలలో మౌళిక వసతులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సైతం అభివృద్ధి పనుల విషయంలో నిత్యం వాకబు చేస్తూ సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ …ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని పాలసీలు మారతాయని వాటికి అనుగుణంగా ప్రజా ప్రతినిధులు కూడ తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. అధికారులు ఆయా పంచాయితీలలో స్థానిక ప్రజా ప్రతినిథులకు తగిన ప్రాధాన్యత ఇచ్చి సమస్యల పరిష్కారానికి వారి తోడ్పాటు తీసుకోవాలని కోరారు. ఇన్చార్జి ఎంపీడీఓ కెజిఎన్ రాజు మాట్లాడుతూ… ఇంజనీరింగ్ అధికారులు వారి టూర్ డైరీలను మండల ప్రజా పరిషత్లో లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు అడిగిన సమస్యలకు రాబోవు సమావేశాల లోపు తప్పనిసరిగా పరిష్కారం చూపాలని కోరారు. సర్పంచిల సంఘం అధ్యక్షుడు, విఠలాపురం సర్పంచి.. మారం ఇంద్రసేనా రెడ్డి పశువుల షేడ్లపై, విద్యావ్యవస్థపై, జల జీవన్ మిషన్ పనులపై పలు సమస్యలను అడిగారు.రమణాల వారి పాలెంలో జల జీవన్ మిషన్ పనుల జాప్యంలో టెండరింగ్ ప్రక్రియ గురించి ఎఈ వలి ల మధ్య సుదీర్ఘ చర్చ జరిగినది. పూర్తి వివరాలు సర్పంచికి అందించాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ఆదేశించారు.
తాళ్లూరు ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, సర్పంచిలు వలి, సుబ్బా రావులు పలు సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. గతంలో సభ దృష్టికి తెచ్చిన సమస్యలు పరిష్కరిస్తే మరలా ఎవైనా సమస్యలు ఉంటే సభ దృష్టికి తీసువస్తారని… స్పందన లేకుంటే ఎలా సభ దృష్టికి తేస్తామని రామభద్రాపురం సర్పంచి బాపిరెడ్డి వెంకట లక్ష్మి అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తాళ్లూరు ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, సర్పంచిలు వలి, సుబ్బా రావులు పలు సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. గతంలో సభ దృష్టికి తెచ్చిన సమస్యలు పరిష్కరిస్తే మరలా ఎవైనా ఉంటే సమస్యలు సభ దృష్టికి తీసువస్తారని… స్పందన లేకుంటే ఎలా సభ దృష్టికి తేస్తామని రామభద్రాపురం సర్పంచి బాపిరెడ్డి వెంకట లక్ష్మి అన్నారు.
డిప్యూటీ తహసీల్దార్ రాజు, పశువైధ్యాధికారి ప్రతాప్ రెడ్డి, ఎంఈఓ – 2 సుధాకర్ రావు, వ్యవసాయాధికారి ప్రసాదరావు, తాళ్లూరు పీహెచ్ సి వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి, తూర్పుగంగవరం పీహెచ్ సి వైద్యాధికారి శ్రీకాంత్, హోమియో వైద్యురాలు శిరీష, హౌసింగ్ ఎఈ కోటి రెడ్డి, ఎం ఎఅన్ఆర్ ఈజీఎస్ ఎపీఓ మురళి, ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతిలు ఆయా శాఖలలో అమలు అవుతున్న పధకాలు, పురోగతిల గురించి సభకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *