ట్రాఫిక్ జామ్ ,రద్దీని ఎలా తగ్గించాలి,పోలీస్ అధికారులు తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఏ సి పి జి.శంకర రాజు అన్నారు.సోమవారం టి టీ ఐ గోషామహల్ లో రిజర్వ్ సబ్ ఇన్స్పెటర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.అలాగే ట్రాఫిక్ నిబంధనలు పోలీస్ అధికారులు తప్పకుండా పాటించాలని సూచించారు.రోడ్ ప్రమాదాలు నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రజల సహకారం అత్యంత ప్రాభావవంతమైన మార్గాల్లో ఒకటి అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో58 మంది పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ లు గోషామహల్ టి టీ ఐ ఇన్స్పెక్టర్ హరీష్,హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్,అబ్దుల్ మజీద్ హీరో మోటో కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ సాదిక్ సాగర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.



