మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పే ముఖ్యమైన పండుగలలో బతుకమ్మ ఒకటని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో సనత్ నగర్ లోని జెక్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలకు హాజరుకావాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 రోజులపాటు రాష్ట్రంలో ని మహిళలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగ విశిష్టత మరింత పెరిగిందని, విశ్వవ్యాప్తంగా నిర్వహించుకోవడం మనకు గర్వకారణం అన్నారు. జెక్ కాలనీలో బతుకమ్మ ను ఘనంగా నిర్వహించేలా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాలు గొప్పగా నిర్వహించేలా సహకరిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, జెక్ కాలనీ బతుకమ్మ కమిటీ అధ్యక్షులు ప్రభ అనంత రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.అన్నపూర్ణ, ఉపాధ్యక్షులు భాగ్యలత, లంక. హైమవతి, అమరావతి, హరిత, కృష్ణ కుమారి, సుజన, శ్రీదేవి, జ్యోతి, స్వప్న, కార్యనిర్వాహక సభ్యులు వాణి, మాధవి, విజయ, జెక్ కాలనీ సభ్యులు సురేష్ గౌడ్, మల్లారెడ్డి, విశ్వనాధ రాజు తదితరులు ఉన్నారు.

