ప్రకాశం జిల్లాలో ఈ నెల 3 నుండి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు – జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ

ఈ నెల 3 నుండి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తెలిపారు. ఈ పరీక్ష జిల్లాలో 4 కేంద్రాల్లో రెండు పూటలా ఉదయం 9.30 నుండి 12 వరకు, మధ్యాహ్నం
2 .30 నుండి 5 గంటల వరకు జరుగుతాయని, ఆన్లైన్ లో పరీక్ష జరుగుతుందని , 11,566 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారని తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో టెట్ పరీక్ష ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించి జాయింట్ కలెక్టర్ పలు సూచనలను జారీ చేసారు. ప్రతి కేంద్రాల వద్దా బందోబస్తు, 144 సెక్షన్ విధించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఆన్లైన్ పరీక్ష అయినందున నిరంతర విద్యుత్ సరఫరా పరీక్షా కేంద్రాలకు ఉండేలా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ఆర్.టి.సి బస్సు లను కేంద్రాలకు, బస్టాండ్ కు నడపాలని, ముఖ్యంగా పండగ దినాల్లో, ఉత్సవాల్లో ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని పరీక్ష రాసే అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద మెడికల్ క్యాంపు ను ఏర్పాటు చేయాలనీ మెడికల్ అధికారులను ఆదేశించారు. హెల్ప్ డెస్క్ ను డి.ఈ.ఓ కార్యాలయం లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సమావేశంలో డి.ఈ.ఓ సుభద్ర, డిప్యూటీ డిఈవో సుబ్బారావు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *