అహింసా మార్గంలో పయనించి భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీజీ అని సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు.బుధవారం రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని ఎం జీ రోడ్ లో గాంధీజీ జయంతి సందర్భంగా ఆమె గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజక వర్గం మాజీ ఏ బ్లాక్ అధ్యక్షులు షేక్ గౌస్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుధామ,అభిషేక్ అడపా,త్రికాల మనోజ్,నసీరుద్దీన్ (అడ్డూ), మునీర్ ఖాన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

