దసరా మహోత్సవం సందర్భంగా దద్దాలమ్మ దేవస్థానంలో శ్రీ దద్దాలమ్మ తల్లి శరన్నవరాత్రులు మూడవ తేదీ నుండి 12వ తేదీ వరకు దర్శి నగర పంచాయతీ పొదిలి రోడ్డు లో వేంచేసి ఉన్న శ్రీ దద్దాలమ్మ దేవస్థానంలో శ్రీ దద్దాలమ్మ తల్లి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దద్దాలమ్మ దేవస్థానం ఆలయ ధర్మకర్త జూపల్లి దాసయ్యనాయుడు, కార్తీక్ శర్మ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. మూడో తేదీ గురువారం బాల త్రిపుర సుందరీ దేవి గాను, నాలుగవ తేదీ శుక్రవారం గాయత్రి దేవి గాను,ఐదో తేదీ శనివారం అన్నపూర్ణాదేవి గాను,ఆరవ తేదీ ఆదివారం లలిత త్రిపుర సుందరి దేవి గాను,ఏడో తేదీ సోమవారం శ్రీ స్వర్ణ కవచాలం కృత దుర్గాదేవి గాను, ఎనిమిదవ తేదీ మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి గాను, 9వ తేదీ బుధవారం శ్రీ సరస్వతీ దేవి గాను, పదవ తేదీ గురువారము శ్రీ దుర్గా దేవి గాను, 11వ తేదీ శుక్రవారం శ్రీ మహిషాసుర మర్దిని గాను, 12వ తేదీ శనివారం శ్రీ రాజరాజేశ్వరిదేవిగాను ప్రతిరోజు ప్రత్యేక అలంకరణ లతో ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతుందని వివరించారు .ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు భక్తులతో భజన కార్యక్రమం ఉంటుందని, అనంతరం వచ్చిన భక్తులకు లాటరీ పద్ధతిద్వారా బహుమతులు అందజేస్తారని, ఈ ఉత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ శరన్నవరాత్రులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భక్తులకు విన్నవించారు.

