స్వచ్ఛత పఖ్వాడా ప్రచార కార్యక్రమాన్ని 01 అక్టోబర్ నుండి 15 వరకు నిర్వహిస్తున్న
దక్షిణ మధ్య రైల్వే……….
స్వచ్ఛత పఖ్వాడా’ప్రచారాన్ని అక్టోబర్ 01 నుండి 15 వరకు ‘స్వభావ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత’ అనే నేపథ్యంపై పాటిస్తున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం స్వచ్ఛ భారత్ దివస్‌ను జరుపుకున్నారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో అధికారులు, సిబ్బందితో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్; ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ మధుసూదన్ రావు; ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ జి.ఆర్.ఎస్. రావు; ఆర్.ఎస్.పి. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్; హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో జరిగిన శ్రమదాన కార్యక్రమంలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో పాటు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ అధికారులతో కలిసి కాచిగూడ రైల్వేస్టేషన్‌లోని స్టేషన్ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఈ సంధర్భంగా స్టేషన్‌లో జనరల్ మేనేజర్ 35 మంది సఫాయి కార్మికులను సత్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జోన్‌లో నిర్వహించిన వ్యాసరచన & డ్రాయింగ్ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. స్టేషన్‌లో రైల్వే ఉద్యోగులు పరిశుభ్రత అంశంపై వీధి నాటకాన్ని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛత అనే అంశంపై సంప్రదాయ నృత్యo ప్రదర్శించారు.
ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. స్వచ్ఛత అనేది కేవలం ఒకరోజు మాత్రమే కాకుండా ఏడాది పొడవునా ప్రతిరోజు పాటించాలని జనరల్ మేనేజర్ పేర్కొన్నారు. రైళ్లు, స్టేషన్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ దిశగా అధికారులు మరియు సిబ్బంది స్వచ్ఛతా ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని వారి కుటుంబ సభ్యులు మరియు పొరుగువారిని కూడా స్వచ్ఛ భారత్ మిషన్‌లో పాల్గొనేలా ప్రోత్సహించాలని జనరల్ మేనేజర్ సూచించారు. స్వచ్ఛ భారత్ దివస్ వేడుక కార్యక్రమ నిర్వహణలో హైదరాబాద్ డివిజన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
దక్షిణ మధ్య రైల్వే స్వచ్ఛతా పఖ్వాడా సందర్భంగా, స్టేషన్లు, రైళ్లు, ట్రాక్‌లు, కాలనీలు, కార్యాలయ ఆవరణలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు మొదలైన వాటిపై ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్‌లు మరియు స్వచ్చత డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రైల్వే వాటాదారుల భాగసామ్యంతో స్టేషన్లు, కార్యాలయాలు, వర్క్‌షాప్‌లు, మెయింటెనెన్స్ డిపోలు, ఆసుపత్రులు/ఆరోగ్య కేంద్రాలు, కాలనీలు మరియు రైళ్లలో పరిశుభ్రతపై స్పష్టమైన ప్రభావాన్ని చూపే దిశగా నిజమైన స్ఫూర్తితో కార్యకలాపాలు చేపట్టనున్నారు. స్వచ్ఛత హి సేవా ప్రచారం ప్రజలలో, రైలు వినియోగదారులలో మరియు రైల్వే సోదరులలో ‘స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్’ మిషన్ యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం లక్ష్యంతో ముందుకు వెళుతుంది.
పరిశుభ్రత అలవాట్లను పాటించడంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి విస్తృతమైన అవగాహన ప్రచారా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

