ప్రజలు అంతా సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. దేవీ నవరాత్రుల సందర్బంగా ఆయన గురువారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవీ నవరాత్రులలో భాగంగా తొలిరోజు బాలాత్రిపురసుందరిదేవి అలంకారంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం EO మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు MLA శ్రీనివాస్ యాదవ్ కు ప్రసాదాలను అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. MLA వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, ఆలయ ట్రస్టీ కామేష్, డివిజన్ BRS అద్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, నాగులు, మహేందర్, ఆనంద్ పాటిల్, చంద్రప్రకాష్, అరుణ్ భట్ తదితరులు ఉన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ సేవలో తలసాని
దేవీ నవరాత్రుల సందర్బంగా మొదటిరోజున మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బాల త్రిపురసుందరి దేవి అలంకారంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంచార్జి EO కృష్ణ ఆధ్వర్యంలో తీర్ధ ప్రసాదాలను అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, సూపరింటెండెంట్ హైమావతి, డివిజన్ BRS అద్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ, లక్ష్మి, బలరాం తదితరులు ఉన్నారు.

