పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు సామాజిక దృక్పథంతో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ అన్ని వర్గాల ప్రశంసలు పొందుతుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు.
ఏపీయూడబ్ల్యూజే సహకారంతో శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ అధ్యక్షతన ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో వర్షాధారం తప్ప మరో నీటి ప్రత్యామ్నయం ఏమాత్రం లేని ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు ప్రజలను వెంటాడుతుంటాయని ఆంధ్ర వ్యక్తం చేశారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తిన వైద్యశాలకు వెళ్లి చూయించుకోలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంటారని అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని మా యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఈ శిబిరాన్ని ఎక్కువ సంఖ్యలో ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
అలాగే వేసవి కాలంలో మంచినీటి చలివేంద్రాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే టు యువకులకు కోచింగ్ సెంటర్లు, రక్తదాన శిబిరాలు ఇలా అనేక సేవా కార్యక్రమాలను మా యూనియన్ నిరంతరం కొనసాగిస్తుందని అన్నారు. ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బందిని రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అభినందించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ మాట్లాడుతూ… వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో యూనియన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ సురేష్ మాట్లాడుతూ… ఏపీయూడబ్ల్యూజే చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలకు రాష్ట్రంలోని అన్ని వర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రశంసలు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ… రాయలసీమలోని అన్ని ప్రాంతాలలో మా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు.
మార్కాపురంలో జరిగిన వైద్య శిబిరానికి రోగులనుండి మంచి స్పందన లభించిందని అన్నారు. ఈ మెడికల్ క్యాంపులో 100 మందికి పైగా ఔట్ పేషెంట్లు రాగా అందులో 60 మందికి కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు అవసరమని నిర్ధారించడం జరిగిందని అన్నారు.
వీరందరిని తమ వాహనాలలో నంద్యాలకు తీసుకెళ్లి కంటి ఆపరేషన్లు నిర్వహించి తిరిగి స్వగ్రామాలకు పంపడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యుజే జిల్లా కార్యదర్శి డి కనకయ్య , ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ సురేష్ కుమార్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె బాజీవలి, కార్యదర్శి బి శంకర్ , ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి. మోహన్ రెడ్డి, వార్త బ్రాంచ్ మేనేజర్ ఎం అల్లూరి రెడ్డి, జిల్లా యూనియన్ కోశాధికారి డి బాబి, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.కె అన్ను, సుబ్రమణ్యం, శేఖర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.





