దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం అంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి దేవాలయం లో అమ్మ వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వచ్చారు.మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తుల ఆలయానికి పోటెత్తారు.దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ కార్య నిర్వహణాధికారి వంగా అంబుజా,ఆలయ ఫౌండర్ చైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేసారు.ఈ సందర్భంగా ఆలయం తో పాటు పరిసరాల్లో ఏర్పాటు చేసిన వివిధ దేవతా మూర్తుల ఆకారంలో ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


