జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలి – జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా

జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, మైనింగ్ అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అనధికార రవాణాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించి పలు సూచనలు ఆదేశాలు జారిచేయడమైనది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అనధికార రవాణాను నియంత్రించేందుకు రెవెన్యూ, పోలీస్, కమర్షియల్ ట్యాక్స్, మైన్స్ మరియు జియాలజీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అవసరమైన మేర మొబైల్ టీం లను ఏర్పాటుతో పాటు కమిటీలో చర్చించిన విధంగా రెండు చెక్ పోష్టులను ఏర్పాటుతో పాటు అవసరమైన ప్రదేశాల్లో సిసిటివి లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మైనింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాపై ఇటీవల తరచూ పిర్యాదులు వస్తున్నాయని, గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులను ఆదేశించారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం చీమకుర్తిలోని బూదవాడ, ఆర్‌ఎల్‌ పురం, చీమకుర్తి గ్రామాలలో 85 బ్లాక్‌ గెలాక్సీ గ్రానైట్‌ క్వారీ లీజులు పనిచేస్తున్నాయని, సగటున జిల్లాకు 250 కోట్ల రూపాయలు రెవెన్యు వస్తున్నదని, ఉత్పత్తి చేసే గ్రానైట్ మెటీరియల్‌లో 80% విదేశాలకు ప్రధానంగా చైనా మరియు థైవాన్ మరియు యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయబడుతోంది మరియు మిగిలిన 20% గ్రానైట్ పదార్థం స్థానిక గ్రానైట్ కటింగ్ మరియు పాలిషింగ్ పరిశ్రమలలో ప్రాసెస్ చేయబడుతోందని, గత 5 సంవత్సరాల్లో జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాపై 1225 కేసులు నమోదు చేసి 206.31 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించినట్లు మైనింగ్ శాఖ డిడి శ్రీ రాజశేఖర్ వివరించారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పి నాగేశ్వర రావు, డిటిసి సుశీల, కమర్షియల్ ట్యాక్స్, మైన్స్ మరియు జియాలజీ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *