పలు సంస్థల చైర్మన్ లు బాధ్యతలు చేపట్టిన వారికి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శనివారం కలిసి అభినందనలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ సంస్థ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నూకసాని బాలాజీకి, ఎపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దామచర్ల సత్యకు, ఎపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మంతేన రామరాజుకు, 20 సూత్రాల అమలు కమిటి చైర్మన్ లంకా దినకర్లకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పుష్పగుజ్జాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

