దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం లో మూడవ రోజు శ్రీ అన్న పూర్ణా దేవి అలంకారం లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయం లో అభిషేకం,అలంకార పూజలు,కుంకుమ అర్చనలు నిర్వహించారు. శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం లో ఉన్న అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు.ఈ సందర్భంగా ఆలయం లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో వంగా అంబూజా,ఆలయ ఫౌండర్ చైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు.దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయం వద్ద విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన వివిధ దేవుళ్ళ రూపాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఆలయ ఫౌండర్ చైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజ్ మాట్లాడుతూ బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారు భక్తులను చల్లగా కాచి కాపాడే తల్లి అని.తనను నమ్మిన భక్తులకు అన్ని విధాల ఆయురారోగ్యాలు.అష్టైశ్వర్యాలు చేకూర్చుతుంది అని అన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఆలయం లో ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలియ జేశారు.

