ఇంట్లో నిద్రిస్తుం డగా వెనుక వైపు వంట గదిలో నుంచి ప్రవేశించి చోరీకి పాల్పడిన ఘటన అద్దంకి పట్టణంలోని ఎస్ఈఎఫ్ నగర్ లో చో టుచేసుకుంది. తాళ్లూరు ఎంఈవోగా పని చేస్తున్న గురజాల సుబ్బయ్య అద్దంకి ప ట్టణంలోని ఎస్ఈఎఫ్ నగర్ లో సొంత ఇంటిని నిర్మించుకొని ఉంటున్నారు. శుక్రవారం రాత్రి సుబ్బయ్య దంపతులు తాళాలు వేసుకొని నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో దొం గలు పైఅంతస్తులోకి వచ్చి ఇంటి వెనుక భాగంలో ఉన్న వంటగది తలుపు గడియ బలవంతంగా తెరిచారు. ఒక బెడ్ రూమ్ లో సుబ్బయ్య దంపతులు నిద్రిస్తుండగా మరో బెడ్ రూమ్ లో ఉన్న బీరువాను తెరిచి అందులో ఉన్న రూ.లక్ష నగదు, సుమారు 3.5 లక్షల విలు వైన 64 గ్రాముల బంగారు అభరణాలను దొంగిలించారు. శనివారం ఉదయం నిద్ర లేచేచూసి చోరీ జరిగినట్లు గుర్తించారు. సుబ్బయ్య అద్దంకి పోలీస్ స్టేష న్ లో ఫిర్యాదు చేశారు. క్ల్యూస్ టీమ్ బృందం వేలిముద్రలను సేకరించారు. ఇటీవల ఎన్టీఆర్ కళాశాల వెనుక వైపు శివసాయి నగర్ లో కూడా ఇదే తరహాలో ఆరేడు ఇళ్లల్లో నిద్రిస్తుండగానే దొంగలు చోరీలకు ప్రయత్నించారు. అదే విధంగా ఎంఈఓ సుబ్బయ్య ఇంట్లో కూడా చోరీ జరగడంతో అదే ముఠా చోరీలకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
అద్దంకిలో తాళ్లూరు ఎంఈఓ నివాసంలో చోరీ
06
Oct