పెయింటర్ కుటుంబానికి దర్శి మానవత సంస్థ ఆత్మీయ సహకారం

దర్శి పట్టణంలో ఎస్సీ కాలనీలో పెయింటర్ గా పనిచేసే గర్నె పూడి శివ ప్రసాద్ శుక్రవారం ప్రమాద వశాత్తు కింద పడి మృతి చెందాడు. సమాచారం తెలుసుకొని మానవత సంస్థ ప్రతినిధులు వెళ్లి శివప్రసాద్ కుటుంబానికి ఆత్మీయ సహకారం అందించారు. సంస్థ చైర్మన్ చేతులమీదుగా రూ. 5000/-నగదు కుటుంబ సభ్యులకు అందించారు. మరియు స్వాతి కలర్స్ నారాయణ రెడ్డి రూ. 5000/- అందచేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వాకా జనార్దన్ రెడ్డి, కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు ధనిరెడ్డి వెంకటరెడ్డి, ట్రెజరర్ జి. వేణు, డైరెక్టర్ పి. రాజకేశవరెడ్డి, సభ్యులు స్వాతి కలర్స్ నారాయణ రెడ్డి, అంబటి వెంకటేశ్వరరెడ్డి, వాకా పూర్ణ చంద్రారెడ్డి, గర్నెపూడి ప్రేమ్ కుమార్ పాల్గొని వారి కుటుంబాన్ని ఓదార్చారు. సానుభూతి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *