ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించి న్యాయం చెయ్యాలని కోరుతూ దాఖలు చేసిన రివ్యూ పటిషన్ రాజ్యాంగ వ్యతిరేకమని దళిత సంఘాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చప్పిడి వెంగళ రావు అన్నారు. బీఎస్ఎన్ఎల్ సేవా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోదీ, ఆర్ఎస్ఎస్ కుట్రలో బాగంగా ఇలా జరిగినట్లు ఆరోపించారు. తీర్పులో సంవత్సరాల వారిగా జరిగిన కుట్రలను వివరించారు. ఎస్సీ, ఎస్టీలను అభివృద్ధికి దూరంగా ఉంచటానికి ఇచ్చిన తీర్పుగా దీనిని బావించి అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. ఆంధ్ర ప్రదేవ్ మాల ఎంప్లాయిస్ ఆసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్నాశి చిరంజీవి మాట్లాడుతూ ….మాల ఉద్యోగుల పట్ల ప్రధాన నగరాలలో నేటికీ వివక్ష కొనసాగుతుందని అన్నారు. ఉద్యోగస్తుల పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితిపై మరింత దారుణంగా ఉన్నట్లు చెప్పారు. డిశంబర్ 14న గుంటూరులో జరుగు మాలల గర్జన జయప్రదం చెయ్యాలని కోరారు. దళిత మహాసభ రాష్ట్ర కార్యదర్శి సంపత్ కుమార్ ఉమ్మడి జిల్లా మాల ఉద్యోగ సంఘ చైర్మన్ ఎరిచర్ల సుబ్రమణ్యం, ఉద్యోగ సంఘాల నాయకులు అంగళ కుర్తి సుబ్బా రావు, మల్లిఖార్జున రావు తదితరులు పాల్గొన్నారు.
