దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగ్ శ్రీ భక్త హనుమాన్ దేవస్థానం లో అమ్మ వారు శ్రీ లలితా దేవి అలంకారం లో భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ చైర్మన్ పీ.ఎన్.నటరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

