దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బేగంపేట ప్రకాశం నగర్ శ్రీ భూలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఆలయనిర్మాణ దాత విశాల్ సూదాం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వర్ణగిరి దేవస్థాన అర్చకులు శ్రవణ్ నేతృత్వంలో శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భూలక్ష్మి అమ్మవారికి అర్చన, మధు దంపతులు మూడు తులాల పుస్తెలు చేయించి అందజేశారు. ఓమ్నీ ఎక్స్ ప్రెస్ కంపెనీ రవికృష్ణ దంపతులు 3000 మంది భక్తులకు అమ్మవారి ఆలయంలో అన్న సంతర్పణ చేశారు. ఈ కళ్యాణం మహోత్సవానికి సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఆలయ నిర్మాణ దాత విశాల్ సుధామ కోట నీలిమాతో అమ్మవారికి పూజలు నిర్వహింపచేసి తీర్థప్రసాదాలను అందించారు. విశాల్ కోట నీలిమను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి మహిళా భక్తులు తరలివచ్చి శ్రీనివాస కళ్యాణం అమ్మవారి పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోవింద రావు,బాలా, కృష్ణ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు




