దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సోమవారం శ్రీ భువనేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భువనేశ్వరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వంగా అంబుజా, ఆలయ ఫౌండర్ చైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజ్ ల నేతృత్వంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాల వితరణ చేశారు.


