దర్శి మండలంలోని రాజంపల్లికి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థి తలపాటి పురందేశ్వరి మృతి చెందినది. విషయాన్ని తెలిసిన మానవత సంస్థ సెక్రటరీ బండి అశోక్, దర్శి సంస్థ కమిటీ మెంబర్ నరసింహారావు , సంస్థ చైర్మన్ దేవత వర ప్రసాద్ సంస్థ సభ్యులతో కలిసి విద్యార్థి కుటుంబాన్ని ఓదార్చారు. విద్యార్థి తల్లికి తమ వంతుగా రూ. 5వేలు ఆర్థిక సహాయం అందించారు. మానవత సంస్థ అధ్యక్షులు ధనిరెడ్డి వెంకట రెడ్డి, కోశాధికారి జీ వేణు, సంస్థ ప్రతినిథులు షేక్ ఖాదర్ మస్తాన్, కె జైహింద్ రెడ్డి, జె సుశీల, అన్నవరపు వెంకటేశ్వర్లు, రాచపూడి మోషే, గర్నెపూడి ప్రేమ్ సాగర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

