మీకోసం కార్యక్రమంలో పలువురు దివ్యాంగులకు వీల్ చైర్స్, వినికిడి యంత్రాలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అందించారు. కొత్త పట్నం వాసి వడ్ల పల్లి వెంకట సుబ్బయ్య కు శ్రవణ యంత్రం, మద్దిపాడు మండల వాసి నడిమేపల్లి నిత్యశ్రీలు అభ్యర్థించారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ దివ్యాంగుల సహాయ సంచాలకులు జి అర్చనను సబంధిత యంత్రాలు మంజూరు చెయ్యాలని ఆదేశించారు . సమస్య పరిష్కరించటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేసారు.

