చట్టాలపై అవగాహన కలిగి ప్రజల ఉపయోగార్థం ఉపయోగించాలి-ఉప సర్పంచిలకు, వార్డు మెంబర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహణ

చట్టాలపై అవగాహన కలిగి ప్రజల ఉపయోగార్థం ఉపయోగించి గ్రామాభివృద్ధిలో బాగస్వామ్యులు కావాలని వక్తలు అన్నారు. ఎంపీడీఓ కార్యాలయం సమావేశపు మందిరంలో మంగళవారం గ్రామ ఉప సర్పంచిలకు, వార్డు మెంబర్లకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు మాట్లాడుతూ గ్రామ పంచాయితీలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నందున మౌళిక వసతుల మెరగుకు మరింత అవకాశం ఏర్పడినదని చెప్పారు. ఉప సర్పంచిలు తమ విధులు తెలుసుకుని బాధ్యతగా పనిచేసి పంచాయితీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని చెప్పారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ… స్థానిక సంస్థల బలోపేతం అయినట్లయితే ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలన అందుతుందని అన్నారు. బాధ్యతగా వార్డు మెంబర్లు పనిచేస్తే స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందని అన్నారు. ఎంపీడీఓ సానికొమ్ము సత్యం, ఈఓపీఆర్డీ సుందర రామయ్యలు గ్రామ సభల నిర్వహణ, పనితీరు, ఆక్రమణల తొలగింపు, ఎస్ ఓ పి చట్టాలపై అవగాహన కల్పించారు. ముందుగా మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించి పునః చ్చరణ తరగతులు ప్రారంభించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *