తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన అధికారికి పది వేలు కాదు పది వేల ఒక్కోంద ఇచ్చాను …అంటూ బాధిత అధికారి గాధంశెట్టి ప్రభాకర్ తహసీల్దార్ నాగలక్ష్మికి మంగళవారం వివరణ ఇచ్చారు. జె. ఎస్ డి .ఎం న్యూస్ లో మంగళవారం ప్రచురితమైన ‘ రూ. పదివేలు తీసుకున్నారు – మీ కోసంలో వినతి ‘ వార్తకు స్పందించిన అధికారులు సంబంధిత బాధితుని వివరణ తీసుకున్నారు. దీంతో ప్రభాకర్ సోమవరప్పాడు రెవిన్యూ పరిధిలోని తన ఖాతా నంబర్ 649ను ఆన్ లైన్ చెయ్యాలని కోరగా 2023 లో తిరస్కరించారని . …తన తల్లిపేరుపై ఉందని ఎండార్స్ మెంట్ ఇచ్చారని చెప్పారు. అయితే తాను తిరిగి 2024 జనవరి 24న తహసీల్దార్ కు అర్జీ పెట్టుకుని సదరు భూమి పాస్ పుస్తకం తన పేరుపై ఉందని గుర్తించి న్యాయం చెయ్యాలని కోరినటుల చెప్పారు. అందుకు సంబంధిత అధికారికి రూ. 10,100 డబ్బులు ఇచ్చి ప్రాసెస్ చెయ్యమని కోరినట్లు చెప్పారు. ముందుగా అప్పటి తహసీల్దార్ కు తప్పుడు సమాచారం ఇచ్చిన ఆ అధికారి తనకు కావలసిన నగదు ఇచ్చే సరిగా ప్రాసెస్ కు ఫైల్ పంపినట్లు ఆరోపించారు. అయినా సరే పని కాక పోవటంతో సోమవారం జరిగిన స్పందనలో ఫిర్యాదు చేసినట్లు తహసీల్దారు వివరణ ఇచ్చారు.
పదివేలు కాదు పదివేల ఒక్కోంద ఇచ్చాను-బాధిత అధికారి తహసీల్దార్ కు వినతి
08
Oct