స్వర్ణాంధ్ర @2047 ఎపి విజన్ అజెండాతో రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలి -రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి

స్వర్ణాంధ్ర @2047 ఎపి విజన్ అజెండాతో రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
స్వర్ణాంధ్ర-2047 విజన్ రూపకల్పన లో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హల్లో మంత్రివర్యులు, శాసనసభ్యులతో వర్క్ షాప్ నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, ముత్తుముల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి , జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్బంగా మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, గౌ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర@2047 విజన్ ను అభివృద్ధి చేసేందుకు సమగ్ర కసరత్తు చేపట్టిందన్నారు. ప్రధాన మంత్రి గారు చెప్పినట్లుగా 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అయ్యే నాటికి భారత దేశం పూర్తిగా అభివృద్ది చెంది ఉండాలన్న లక్ష్యంతో వికసిత్ భారత్ పేరుతో అన్నీ రంగాలను అభివృద్ది చేసేలా 2047 కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుచున్నదన్నారు. అందులోభాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర భాబు నాయుడు స్వర్ణాంధ్ర@ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడిపించడం, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పూర్తిగా రూపు మాపాలని, ప్రజల జీవన ప్రాణాలు పెరగాలి, తలసరి ఆదాయం పెరగాలాన్న లక్ష్యంతో ముందుకు పోతున్నారన్నారు. ముందుగా ప్రైమరీ సెక్టార్ ను మరింతగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వారున్నారన్నారు. వ్యవసాయ దాని అనుబంధ రంగాలను మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆనాడు అనంతపురం జిల్లా కరువు ప్రాంతంగా వుండేదని, 2014-19 సంవతరాల కాలంలో ఆనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఉద్యాన పంటల ప్రోత్సాహకం వలన నేడు అనంతపురం జిల్లా మంచి ఆదాయంతో సస్యశ్యామలంగా వుందన్నారు. ప్రతి ఒక్క ప్రాంతాన్ని మండల యూనిట్ గా అభివృద్ది పధంలో నడిపించేలా ముందుకు పోతున్నామన్నారు. ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు, అలాగే యువతకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తూ యువత సేవలను సమర్ధవంగా వినియోగించుకొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. స్కిల్ సెన్సెస్ కూడా చేపడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏం.ఎస్.ఏం.ఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో ఫార్మా రంగాన్ని ముందుకు తీసుకువచ్చేందుకు అలాగే జిల్లాలో గ్రానైట్ రంగానికి మరింతగా ప్రోత్సాహం కల్పించేలా ముందుకు పోతున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో వ్యవసాయ దాని అనుబంధ రంగాలను మరింతగా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. వెలుగొండ ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లా ఏర్పాటు వెనుకబడిన ప్రాంతాలతో ఏర్పడటం జరిగిందని, జిల్లాలో వీలైనంత వరకు చెక్ డ్యామ్ ల నిర్మాణాలను చేపట్టి సమర్ధవంతంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టేలా ప్రణాళికలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. మార్కాపురం మెడికల్ కళాశాలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి త్వరలో ప్రారంభించుకొనేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దొనకొండ పారిశ్రామిక వాడను అభివృద్ది చేసుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. జిల్లాలో భూ సమస్యల పై దృష్టి సారించడం జరిగిందని, అందులో భాగంగా త్వరలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని మంత్రి ఈ సంధర్భంగా తెలిపారు. ప్రకాశం జిల్లాను 2047 నాటికి స్వర్ణ ప్రకాశం గా ముందుకు తీసుకెళ్ళేందుకు జిల్లాలో వ్యవసాయ, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుచున్నదని, ప్రతి ఒక్కరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. విద్య, యువతకు ఉపాధి, పారిశ్రామిక రంగం అభివృద్ది మరియు జిల్లా లో వున్న వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవడం ద్వారా జిల్లాను అభివృద్ది పధంలోకి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ స్వర్ణాంధ్ర@2047 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపు నిచ్చారు. స్వర్ణాంధ్ర@2047 లక్ష్య సాధనకు భవిష్యత్ తరాలకోసం అధికారులు కృషిచేయాలని మంత్రి అన్నారు.

జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంటరీని రాష్ట్రంలో తయారు చేయడం జరుగుచున్నదన్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కు సంబంధించి విజన్ డాక్యుమెంట్ ను తయారు చేయడానికి శాఖల వారిగీ రెండు నెలల నుండి ఈ విజన్ డాక్యుమెంట్ ను ఎలా తయారు చేయాలి అన్న విషయాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. మన జిల్లా అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యల పై అన్నీ రంగాల ప్రజలను భాగస్వాములు చేసి అందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. అందులో భాగంగా ఈ రోజు ప్రజాప్రతినిధులను ఈ విజన్ డాక్యుమెంటరీ తయారీలో భాగస్వాములను చేసి వారి సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. 2047 విజన్ సాకారమవ్వాలంటే, వ్యూహాత్మక దృష్టి సారించాల్సిన కొన్ని రంగాలను ఇక్కడ గుర్తించడమైనది. వ్యవసాయ దాని అనుబంధ రంగాలు, విద్య మరియు నైపుణ్యం, ఆరోగ్యం మరియు సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీ, సుస్థిరత మరియు వాతావరణ సమతుల్యత, ఆర్ధికాభివృద్ధి, అత్యాధునిక తయారీరంగం మరియు లాజిస్టిక్స్, నాలెడ్జ్ ఎకానమీ పై ప్రత్యేక దృష్టి సారించేలా ఆ శాఖల ద్వారా 15 శాతం వృద్ది రేటుతో రాష్రంలోని అన్ని జిల్లాలు, మండల స్ధాయిలో రాబోయే 5 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు ప్రణాళికలు రుపోందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో నన్ను కేంద్ర హౌసింగ్ మరియు అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీకి ఛైర్మన్ గా నియమించడం పట్ల ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కమిటీ లో అమృత్, స్వచ్చ భారత్ కార్యక్రమాలు వుంటాయని, రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వెనుక బడిన జిల్లా అయిన ప్రకాశం జిల్లా అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని, స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ లో భాగంగా జిల్లా ను ఏ విధంగా అభివృద్ది చేసుకోవాలన్నా విషయంపై ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, అలాగే సి.ఎస్.ఆర్ నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

స్వర్ణాంధ్ర@2047 విజన్ డాకుమెంటరీ రూపకల్పనలో జిల్లా అన్నీ రంగాలలో అభివృద్ది ప్రధంలో ముందుకు వెళ్ళేల్లా , ముఖ్యంగా వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంత అభివృద్దిని దృష్టిలో వుంచుకొని స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించాలని అందుకనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కార్యక్రమానికి హాజరైన ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి శాసన సభ్యులు దామాచర్ల జనార్ధన రావు, ముత్తుముల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తమ అభిప్రాయాలను, సూచనలు తెలియచేసారు.

ఈ సంధర్భంగా వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పరిశ్రమలు, జల వనరులు, ఆర్.డబ్ల్యూ. ఎస్., పర్యాటక శాఖలు రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ను సంబంధిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ వర్క్ షాప్ లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వేంకటేశ్వర రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *