విద్యార్ధులకు పాఠ్యాంశాలభోదనతో పాటు జనరల్ నాలెడ్జి పెంపొందేలా భోధన వుండాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు.మంగళవారం ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో జరిగిన మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయం పరిస్థితి, 2024-25 సెషన్ కోసం అడ్మిషన్ మార్గదర్శకాలు, తరగతుల వారీగా విద్యార్థుల నమోదు, సిబ్బంది మంజూరు మరియు ఖాళీ పోస్టులు వివరాలు, గత కమిటీ సమావేశం ఎజెండా వివరాలు, తీసుకున్న చర్యలు, ప్రస్తుత కమిటీ సమావేశం ఎజెండా వివరాలు తదితర అంశాలను కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ఎం. మనీష్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …. కేంద్రీయ విద్యాలయంలో విద్యార్ధులకు పాత్యంశాల భోదనతో పాటు జనరల్ నాలెడ్జి పెంపొందేలా భోధన ఉండాలన్నారు. సమాజంలో ఉత్తమ పౌరులుగా జీవించేలా విద్యార్ధులను తీరిచిదిద్దాలసిన బాధ్యత మీ పై ఉందన్నారు. క్రమం తప్పకుండా విద్యార్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు విద్యార్ధుల్లో గ్రూప్ యాక్టివిటీస్ ను పెంపొందించాలన్నారు. పిల్లల్లో వున్న సృజనాత్మకతను గుర్తించి అందుకనుగుణంగా భోధన వుండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పాఠశాల పక్కనే అందుబాటులో ఉన్న ప్లే గ్రౌండ్ కోసం భూమి కేటాయింపు విషయమై పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో కేంద్రీయ విద్యాలయం కమిటీ సభ్యులు స్టెప్ సి ఈ ఓ లోకేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. సురేష్ కుమార్, ఒంగోలు రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ శ్రీ ప్రకాష్ బాబు, జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి, ఒంగోలు కేంద్రీయ విద్యాలయం రిటైర్డ్ ప్రిన్సిపాల్ సూర్యప్రకాష్ రావు, ఒంగోలు మునిసిపల్ కార్పోరేషన్ ఇంజనీర్ శ్పద్మజ తదితరులు పాల్గొన్నారు.


