డాక్టర్ గండవరం జ్యోతి రెడ్డి ఎండి (గైనకాలజీ) మరియు వల్లూరి అనిల్ కుమార్ ఎం.డి (అనస్తీషియా) ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు, ఎస్2 మల్టిప్లెక్స్ రోడ్ లో శ్రీ వైష్ణవి హాస్పిటల్ ప్రారంభోత్సవం, నూతన గృహప్రవేశం సందర్భంగా స్టోన్ హౌస్ పేట లోని విఎమ్ఆర్ జెనెరిక్ మందులు షాపు అధినేత వి మనోజ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను ఉపయోగించి నెల్లూరు, పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, పేదలకు అతి తక్కువ ధరలో వైద్యం అందించి పేదల మన్ననలు పొందాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
