బేగంపేట ప్రకాశం నగర్ శ్రీ భూలక్ష్మి అమ్మవారి దేవాలయంలో గురువారం చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణ దాత విశాల్ సుదాం, ఈవో ఎం విఠలయ్య లు తెలియజేశారు. ఉదయం 10 గంటలకు చండీ హోమం ప్రారంభమవుతుందన్నారు. చండీ హోమంలో పాల్గొనే వారు సంప్రదాయ దుస్తులలో రావాల్సి ఉంటుందని తెలియజేశారు. మగవారు తెలుపు పంచే,కండువా,దరించాలని అడవారు ఎరుపు రంగు చీర ధరించి రావాల్సి ఉంటుంది అని అన్నారు.హోమం అనంతరం అన్న ప్రసాద వితరణ వుంటుందన్నారు.అర్చకులు మఠం సదాశివుడు మాట్లాడుతూ చండీ హోమం ఎక్కడ జరుగుతుందో అక్కడ దుర్భిక్షం,దుఃఖమనేది వుండదు అన్నారు.అకాల మరణాలు వుండవు అన్నారు.కలియుగంలో చండీ పారాయణానికి మించిన శక్తి వంతమైన ఫల సాధన మరొకటి లేదన్నారు.నవగ్రహ దోషం,కుజదోషం, కాలసర్ప దోషం, శని దోషం,పితృదోషం,
ఇవన్నీ కూడా చండీ హోమం చేసుకోవడం వల్ల తొలగి పోతాయాన్నారు.నవరాత్రి ఉత్సవాలలో జరిగే చండీ హోమం లో పాల్గొనడం సకల శుభాలు కలిగిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాత విశాల్ సుధామ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చండీ హోమం లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు.మరిన్ని వివరాలకు అర్చకులు మఠం సదా శివుడిని సంప్రదించాలని కోరారు.
