మద్యం షాపుల ప్రారంభానికి ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 11 సాయంత్రం ఏడు గంటల వరకే అవకాశం ఉందని దర్శి ఎక్సైజ్ సీఐ కె. శ్రీనివాసరావు తెలిపారు . బుధవారం న్యూస్ పేపర్ లో వచ్చిన వార్త కథనం ప్రకారం గవర్నమెంట్ మద్యం షాపు ల లో మద్యం అమ్మేందుకు గడువు ఈ నెల 15వ తారీకు వరకు మాత్రమే ఉందని ఆ కథనం సారాంశమని చెప్పారు. మద్యం దుకాణాలు లాటరీలలో వచ్చిన వ్యక్తులు అక్టోబర్ 16వ తారీకు నుండి మద్యం షాపులు తెరుచుకొని అమ్ముకోవడానికి హక్కు అని ఆ వార్త కథనంలోని సారాంశాన్ని వివరించారు. దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం …ఈ నెల 11 ఆఖరి గడవని ఆశవాహులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు.

