దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ మండపాలలో అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు. రాంగోపాల్ పేట డివిజన్ లోని రంగ్రేజ్ బజార్, కుమ్మరి బస్తీలలో ఏర్పాటు చేసిన మండపాలలో వివిధ రకాల అలంకరణలలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆవుల మంద లోని శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి ఆలయంలో లక్ష్మీదేవి అలంకారంలో ని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వహకులు MLA ను ఘనంగా సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, BRS డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు బాలేందర్, సూర్యప్రకాష్, దీపక్ గుప్తా, ఆనంద్, వెంకటేష్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, మధు, ప్రేమ్, మల్లిఖార్జున్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.



