సరస్వతి దేవి అలంకారం లో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు…….

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమీర్పేట శ్రీ కనకదుర్గ ఆలయం లో బుధవారం శ్రీ సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో వివిధ రకాలైన పూలతో సుందరంగా అలంకరించారు. ఆలయ ఈవో వంగ అంబుజా ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త గా ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *