ఒంగోలు మాజీఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ ఉత్తర క్రియలకు తాళ్లూరు టీడీపీ నేతలు బుధవారం తరలి వెళ్లి నివాళులు అర్పించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢసానుభూతిని తెలిపారు. నెల్లూరులోని మాగుంట నివాసంలో జరిగిన ఉత్తర క్రియల కార్యక్రమానికి ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షులు బి.ఓబుల్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి శాగం కొండారెడ్డి, రాష్ట్ర తెలుగు యువతకార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, రాష్ట్ర టీడీపీ మైనారిటీ సెల్ కార్యదర్శి షేక్ కాలేషావలి, మండల టీడీపీబీసీ సెల్ నేత పిన్నిక రమేష్,టీడీపీ క్లస్టర్ ఇంచార్జిరాచకొండ వెంకట రావు, కొర్రపాటిరామయ్య, కైపు రామకోటిరెడ్డి తదితరులు ఉన్నారు. తాళ్లూరు జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, బెల్లంకొండవారి పాలెం సర్పంచ్ పి. ఏస్ శ్రీకాంత్ రెడ్డి లు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎం పీ మాగుంటతో కలిసిపార్వతమ్మ చిత్రపటం వద్ద నివాలులు అర్పించారు.
