ప్రజలకు ఉచిత ఇసుకను పారదర్శకంగా సరఫరా చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

ప్రజలకు ఉచిత ఇసుకను పారదర్శకంగా సరఫరా చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమని, అందులో భాగంగా జిల్లా ప్రజలకు ఇసుకను అందుబాటులో తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బుదవారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్లో జిల్లాలో ఇసుక లభ్యత, సరఫరాపై మరియు మద్యం పాలసీ పై జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఎస్.పీ. ఏ.ఆర్.దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ లతో కలసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ఈ సంవత్సరం జులై 8 నుండి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ను తీసుకొని రావడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో జులై 8 వ తేదీ నుండి 62, 291 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచిత ఇసుక పాలసీ కింద ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ రోజు కు మన జిల్లలో ఇసుక స్టాక్ పాయింట్స్ లేవని, జిల్లాకు అవసరమైన ఇసుకను నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని ఇసుక స్టాక్ పాయింట్స్ నుండి సరఫరా జరుగుచున్నదని కలెక్టర్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో స్థానిక అవసరాల కోసం మొత్తం 285 వాగులు మరియు వంకలను గుర్తించడం జరిగిందన్నారు. గుర్తించిన వాగులు, వంకల నుండి సమీపంలోని గ్రామాల ప్రజలు తమ సొంత గృహ నిర్మాణాల అవసరాలకు వాడుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా చట్టబద్ధమైన అనుమతులు పొంది పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు సంబంధిత వ్యక్తులు దరఖాస్తు జిల్లా స్థాయి సాండ్ కమిటీకి చేసుకుంటే పరిశీలించి అనుమతి ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. రానున్న రోజుల్లో అనుమతి ఇచ్చిన పట్టా భూముల ఇసుక రీచ్ ల నుండి ఇసుక రవాణా చేసుకోవచ్చునన్నారు. ఏపి శాండ్‌ పోర్టల్‌లో ఇసుక బుక్‌ చేసుకున్న వారు సొంత వాహనం ద్వారా ఇసుక తీసుకెళ్లవచ్చని లేదంటే పోర్టల్‌లోనే ట్రాన్స్‌పోర్టు సౌకర్యం కూడా ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఈ నెల అక్టోబర్ నుండి 2025 మార్చి వరకు జిల్లాలో 4.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమని అంచనా వేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు దగ్గరలోని నెల్లూరు జిల్లాలోని కరేడు మరియు దప్పలంపాడు రెండు డిసిల్టేషన్ పాయింట్స్ నుండి 2,26,108 మెట్రిక్ టన్నుల ఇసుక అక్టోబర్ 15 తేదీ నుండి జిల్లాకు అందుబాటులోకి రానున్నదని కలెక్టర్ వివరించారు. అదే విధంగా కడప జిల్లాలో అక్టోబర్ 15 నుండి 10 ఇసుక ఓపెన్ రీచ్ లు ప్రారంభం కానున్న నేపద్యంలో కడప జిల్లా నుండి కుడా 693750 మెట్రిక్ టన్నుల ఇసుక జిల్లా ప్రజల అవసరాలకు అందుబాటు లోకి రానున్నట్లు కలెక్టర్ వివరించారు. గత నెల సెప్టెంబర్ నెల 20 తేదీ నుండి ఇసుక కావాల్సిన ప్రజలు https://sand.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడం జరుగుచున్నదన్నారు. ఇప్పటివరకు 10, 287 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం 519 ఆర్డర్స్ బుక్ అయినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణా, బ్లాక్ మార్కెటింగ్ చేసేవారిపై చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ఇప్పటి వరకు 32 కేసులు బుక్ చేసి 8.78 లక్షల రూపాయలు పెనాల్టీ విధించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఇసుక కార్యకలాపాలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు వినియోగదారుల కోసం 6281799518 ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పిర్యాదులపై వెంటనే పరిష్కారం చూపడం జరుగుచున్నదని కలెక్టర్ వివరించారు. ఇసుకను జిల్లాలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్‌ వివరించారు. ప్రజలు ఎవరూ కూడా ఇసుక కోసం దళారులను ఆశ్రయించవద్దని, ప్రజలందరూ ఏపి శాండ్‌ పోర్టల్‌ ద్వారా మాత్రమే ఇసుకను బుక్‌ చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన మద్యం పాలసీలో భాగముగా ప్రకాశం జిల్లా వ్యాప్తముగా ఈ నెల 1వ తేదీ గజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. గజిట్ నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలో 171 మద్యం దుకాణంలకు ఈ నెల 1వ నుండి ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ రూపంలో ధరఖాస్తులను స్వీకరించుట జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు. విధి విధానాలు అనుసరించి ఒక వ్యక్తి ఎక్కడ నుండి అయిననూ ఎన్ని ధరఖాస్తులను అయిననూ ఒక దుకాణముపై వేయవచ్చు, అదే విధముగా ఒక వ్యక్తి ధరఖాస్తులను ఎన్ని దుకాణములపైన అయిననూ వేయవచ్చు, అదే విధముగా ఒక వ్యక్తి ఎన్ని లైసెన్సులు అయిననూ పొందవచ్చునని కలెక్టర్ వివరించారు. ఈ నెల 16వ తేదీ నుండి 2026 సెప్టెంబర్ 30 వరకు రెండు సంవత్సరాల కాల పరిమితితో లైసెన్సు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో 171 దుకాణాల్లో గీత కార్మికుల కోసం 17 దుకాణాలు కేటాయించవలసి వుందని, వాటికి ప్రత్యేకంగా మార్గదర్సాకాలు రావల్సివుందని కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు 1685 దరఖాస్తు రావడం జరిగిందన్నారు. సవరించిన ప్రభుత్వ ఆదేశముల మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, ఈనెల 14వ తేదీన డ్రా తీయుట జరుగుతుందని, డ్రాలో గెలుపొందిన వారు ఈ నెల 16వ తేదీ నుండి నుండి మద్యం దుకాణమును ఏర్పాటు చేసుకొని వ్యాపారమును కొనసాగించవచ్చునని కలెక్టర్ వివరించారు.

జిల్లా ఎస్.పి ఎ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక రీచ్ లలో వున్న ఇసుక అందరికి అందుబాటులో వుంచాలన్న లక్ష్యంతో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వారిపై మరియు ఇసుకను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా వుంచడం జరుగు చున్నదన్నారు. ఇప్పటి వరకు 70 కేసులను బుక్ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక పాలసీని పటిష్టంగా అమలు జరిగేలా క్షేత్ర స్థాయిలో టీం లను కూడా ఏర్పాటు చేసి పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని ఎస్.పి వివరించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే సంబంధిత వాహనాలను సీజ్ చేయడం, అరెస్ట్ చేయడం, మరలా మరలా పట్టుబడితే వారి పై పిడి యాక్ట్ పెట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్.పి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *