రతన్ టాటా కి భారతరత్న ఇస్తే చాలా బాగుంటుందని సామాజిక కార్యకర్త పుట్టా రామకృష్ణ అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి తమ అంగీకారం పంపాలనీ, ప్రజలందరూ దీనికి మద్దతు పలకాలని రామకృష్ణ విజ్ఞప్తి చేసారు. రతన్ టాటా మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించేలా అత్యున్నత స్థాయిలో దివికేగిన నెలవంక రతన్ టాటా. భూమి ఉన్నన్ని రోజులు గుర్తు పెట్టుకునే ఏకైక పారిశ్రామిక వేత్త రతన్ టాటా కి సామాజిక కార్యకర్త పుట్టా రామకృష్ణ అంజలి ఘటించారు. మన దేశానికి యుద్ధ విమానాల కోసం 2000 కోట్లు సహాయం చేసిన మహనీయుడు, దేశంలో మతాలకు సంబంధం లేకుండా కరోనలో 1500 కోట్లు సహయం చేసిన మహామనిషి, దేశానికి పుల్వామా తరువాత 600 టాటా సఫారీ బులెట్ ఫ్రూఫ్ కార్లను అందించిన ధీరుడు, పేదవాడి కల నెరవేర్చడానికి 86% నష్టాలు వస్తున్నా సరే నానో కార్లను అందించిన యోధుడు, తన కంపెనీలో 2 లక్షల మందికి ఉపాధి కల్పించిన మహనీయుడు రతన్ టాటా అని రామకృష్ణ పేర్కొన్నారు.
