ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తండ్రి కృష్ణా రావుకి నాయుడుపాలెంలోని వారి గృహములో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పి వీ శివారెడ్డి. ఈ సందర్భముగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావుల మధ్య జిల్లా మరియు ఒంగోలు నియోజక వర్గం అభివృద్ధి గురించి చర్చ జరిగినది. శివారెడ్డి ఒంగోలు నియోజక వర్గంలో పారిశుధ్యo గురించి, వాటి ప్రక్షాళణకు తక్షణమే అమలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దానికి ఒంగోలు శాసనసభ్యులు జనార్ధన ఒంగోలు మున్సిపాలిటీ పారిశుద్ధ్యనికి ఎక్కువగా ప్రాథాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలు ఉన్న వెంటనే అధికారులకి మాకు తెలియజేసిన యెడల వాటి చర్యలు వాటి మీద చర్యలు తీసుకొని వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జిల్లా కార్యదర్శి బసినేపల్లి రాజశేఖర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
