రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా , వైద్యులకు సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, యర్రగొండపాలెం కమ్యూనిటి హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని
ఎన్ టి ఆర్ వైద్య సేవల కౌంటర్ ను, రోగుల రిజిస్ట్రేషన్ రూమును సందర్శించి రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ను, స్త్రీ లు, పురుషుల సర్జికల్ వార్డులను, డయాలసిస్, క్యాజువాలిటి రూములను, అత్యవసర సేవా విభాగంను, కాన్పులు, పిల్లల వార్డులను , నవజాత శిశు సంరక్షణ కేంద్రంను, ఐటిడిఎ ప్రత్యేక వార్డును తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఆసుపత్రి లో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, వైద్యులు సక్రమంగా చూస్తున్నారా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, వైద్యులకు సూచించారు. ఆసుపత్రి కి కొంత భాగం కాంపౌండ్ వాల్ నిర్మించాల్సి వుందని, అలాగే ఆసుపత్రి ఆవరణలో లెవలింగ్ చేయాల్సి ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. యదీద్యా, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, తహశీల్దార్ బాల కిషోర్, ఎంపిడిఓ శ్రీనివాసరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా యదీద్యా, ఇతర అధికారులు ఉన్నారు.

తొలుత యర్రగొండపాలెంలో నూతనంగా నిర్మించిన రైతుబజార్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రైతుబజార్ ఆవరణలో లెవలింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ మార్కెటింగ్ శాఖ ఎడి ఉపేంద్ర కుమార్ ను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *