బేగంపేట ప్రకాశం నగర్ లోని శ్రీ భూలక్ష్మి అమ్మవారి దేవాలయంలో దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని బేగంపేట కార్పొరేటర్ టి మహేశ్వరి శ్రీహరి దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణదాత విశాల్ సుధామ కార్పొరేటర్ దంపతులను శాలువా పూలమాలలతో సత్కరించి పూజలు నిర్వహింప చేశారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. సందర్భంగా కార్పొరేటర్ టి. మహేశ్వరి శ్రీహరి మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని భక్తుల దర్శించుకోవడం ఎంతో పుణ్యం అన్నారు. శ్రీ భూలక్ష్మిఅమ్మవారు ప్రజలను చల్లగా చూడాలని కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి అమ్మవారిని కోరుకున్నారు.

