బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ కార్ ఉపకార్ జంక్షన్ లో కరీంనగర్ డిపోకు చెందిన బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి….గురువారం మధ్యాహ్నం సమయం లో కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఏ పి 29జెడ్ 1796నెంబర్ కలిగిన బస్సు జే బి ఎస్ నుంచి బయలుదేరి కరీం నగర్ వెళుతుంది. స్వీకార్ ఉప్ కార్ జంక్షన్ వద్దకు వచ్చి సరికి వాటర్ బాటిల్స్,చిప్స్ అమ్ముకునే భరత్ (35) మూల మలుపులో తిరుగుతున్న బస్సు వద్దకు వచ్చే ప్రయత్నం చేశాడు.మూలమలుపులో వున్న భరత్ ను ఆర్టీసి బస్సు ఢీ కొంది.దీంతో అతనికి తీవ గాయాలయ్యాయి.ఇది గమనించిన వారు వెంటనే 108 కి సమాచారం ఇచ్చి గాంధీ ఆస్పత్రికి తరలించగా అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు ప్రకటించారు.ఈ ఘటనపై బేగంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.మృతుని ఆచూకీ తెలిసిన వారు బేగంపేట పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్సై జే.నాగరాజు తెలియజేశారు.
