సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీఎస్సీ కోచింగ్ నిమిత్తం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మూడు నెలల పాటు ఉచిత కోచింగ్, బోజన వసతి సౌకర్యం కల్పించబడునని జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎన్ లక్ష్మా నాయక్ తెలిపారు. అభ్యర్థులు ఈనెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎస్ జి టి అభ్యర్థులు ఇంటర్మిడియట్, డీఈడీ, టెట్ అర్హత కలిగి, స్కూల్ అసిస్టెంట్లకు డిగ్రీ, బిఈడీ, టెట్ అర్హత కలిగి ఉండాలని, వార్షికాదాయం రూ. 2.5 లక్షలు లోపు ఉన్న విద్యార్థులు అర్హలని తెలిపారు. కావున అర్హత ఉన్న అభ్యర్ధులు జ్ఞాన భూమి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
