దర్శి నియోజక వర్గంలో నూతన లాటరీ విధానంలో ప్రభుత్వానికి రూ.7.50 కోట్ల ఆదాయం అదనంగా వచ్చినట్లయినది. నియోజక వర్గంలో మొత్తం 376 దరఖాస్తులు రాగా ప్రతి దరఖాస్తుకి రూ. 2 లక్షల చొప్పున తీసిన డీడీలతో ఈ ఆదాయం సమకూరింది. ఈ డీడీల మొత్తం దరఖాస్తు దారులకు తిరిగి చెల్లించే పద్దతి లేక పోవటంతో ఈ మొత్తం ప్రభుత్వానికి అప్పనంగా వచ్చినట్లయినది.
