తాళ్లూరు మండలం లక్కవరం గ్రామంలో దుర్గాదేవి గ్రామోత్సవంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక, మండల నాయకులు డాక్టర్ బూచేపల్లికి ఘన స్వాగతం పలికారు. యువకులు ఉత్సాహంగా డాక్టర్ బూచేపల్లితో సెల్ఫీలు దిగి తమ ఆనందాన్ని పంచుకున్నారు. డాక్టర్ బూచేపల్లి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.




