14 న ఒంగోలులో ‘ మీకోసం ‘ రద్దు

     అక్టోబర్ 14వ తేదీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ' మీకోసం ' ( గ్రీవెన్స్ )  కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి  ఆర్.శ్రీలత తెలిపారు. జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం సోమవారం లాటరీ ప్రక్రియను నిర్వహించాల్సి ఉన్నది.   జిల్లా కలెక్టరుతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నందున ' మీకోసం ' కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని, దూరప్రాంతాల నుంచి ఎవరూ ఒంగోలు రావద్దని డీ.ఆర్.వో. సూచించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *