సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్ లోని శ్రీ సాయిబాబా ఆలయంలో 106వ మహాసమాధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం లక్ష పుష్పార్చన కార్యక్రమం జరిగింది .పూజలలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు .సాయి బాబాకు పూజలు నిర్వహించారు. పుష్పాలు సమర్పించారు .ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు.


