దసరా పండుగ సందర్భముగా శని, ఆదివారాలలో తాళ్లూరు మండలంలోని పలుగ్రామాలందు దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సంద ర్బముగా తాళ్లూరులోని కన్యకాపరమేశ్వరి అమ్మవారు గ్రామంలో శనివారం గ్రామోత్సవం జరిపారు. ఈ సందర్భంగా కేరళ కళాకారులు నిర్వహించిన కథాకళి డప్పువా యిద్యాలు అలరించారు. బొద్దికూరపాడు గ్రామంలో శ్రీగంగా పార్వతి వర్థిని సమేత సోమేశ్వరస్వామి దేవాలయం, మాధవస్వాముల ఉత్సవిగ్రహాలను అలంకరించి గ్రా మోత్సవం నిర్వహించారు. శనివారం రాత్రి తాళ్లూరులోని పార్వతీ సమేత రామలింపార్వతీ సమేతరామలిం గేశ్వరస్వామి, రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామిఆలయాల వద్ద దేవీ నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహించారు. దశమి సందర్భముగా స్వాముల దేవతా మూర్తిలవిగ్రహాలను గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి పారువేట వద్దకువెళ్లి జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామవీధుల్లో స్వాములనగర యాత్ర జరిపారు. 10రోజులపాటు దుర్గామాతకు శరన్నవరాత్రులు నిర్వహించిగ్రామాల్లో ఊరేగింపు
చేపట్టారు. తాళ్లూరు గ్రామంలో ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందిరం నందు కోడూరు నరసింహం పంతుల భజన బృందంచే చేపట్టిన కోలాట ప్రదర్శనఅందరిని అలరించింది. ఆయా కార్యక్రమాల్లో ఐ.వెంకటేశ్వరరెడ్డి, ఐ.సుబ్బా రెడ్డి, కోట క్రిష్ణారెడ్డి, చందోలు రామారావు, కోట మన్నేరెడ్డి, చందోలు ఆంజనేయులు, అనపర్తి లక్ష్మయ్య, ఆలయకమిటీ చైర్మన్ పులి అంజిరెడ్డి, పులి ప్రసాద్ రెడ్డి, తదితరులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


