దర్శి నియోజక వర్గంలో అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ముగిసింది. నియోజక వర్గంలో 23 మద్యం దుకాణాలకు 376 మంది రూ. 2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ డీడీలు, ఫీజు చెల్లించగా అందులలో 23 మంది మాత్రమే లక్ తగిలినట్లయినది. అందులో దర్శి నగర పంచాయితీలో తిండి నారాయణ రెడ్డి, నిడమానూరి నరసింహా రావు, ప్రసాద్ ధర్నేకి రెండు దుకాణాలు, దూళి పాళ్ల రమ్య క్రిష్ణ లు ఉన్నారు. దర్శి రూరల్ లో మధుమంచి ఏడు కొండలు, పుల్లలచెరువు సత్యనారాయణ, వెంకట రావు తానికొండ, బోయిల నాగేశ్వర రెడ్డిలు ఉన్నారు. దొనకొండ మండలంలో తాండ్ర వెంకటేశ్వర్లు, పులి గడ్డ సాయి క్రిష్ణ, తుపాకుల శివ క్రిష్ణ, కురిచేడు మండలంలో ఇంటూరి శ్రీనివాస రావు, పి రామాంజనేయులు, గడ్డం బాలయ్యలు ఉన్నారు. ముండ్లమూరు మండలంలో కూరపాటి నారాయణ స్వామి, జంపాని శ్రీనివాస రావు, మార్తల యలమందా రెడ్డి, వెన్నగిరి వెంకట రావులు ఉన్నారు. తాళ్లూరు మండలంలో కూనం సత్యనారాయణ, యర్రం రెడ్డి వెంకట రెడ్డి, పొలం రెడ్డి సుధాకర్ రెడ్డి, గనపర్తిసంజయ్ లు ఉన్నారు.
అధిక సంఖ్యలో కూటమిలుగా ఏర్పడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి టెండర్స్ వేసిన దక్కక పోవటంతో పలువురు నిరుత్సాహంలో మునిగిపోయాయి. అదే విధంగా లక్లో లాటరీ తగిలిన వారు వారికి వారికి కూటమి సభ్యులు ఆనందానికి అవధులు లేవు.

