దామగుండం తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్టుకు మూడువేల ఎకరాల స్థలం సేకరించాల్సి రావడం వల్ల పర్యావరణానికి జీవ వైవిధ్యానికి మొత్తంగా మానవాళికి ఎంతో హాని కలుగుతుంది అనీ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ఆరోపించారు. ఇది దామగుండం కాదని అగ్నిగుండం అనే ఆమె ఆక్షేపించారు.ప్రభుత్వం సేకరించే 3 ఎకరాల్లో వేలాది చెట్లు దీనివల్ల నేలమట్టం కానున్నాయని ,ఆమె ఆవేదన వ్యక్తం చేశారు .ఒక్కో చెట్టు పెంచాలంటే ఏళ్లపాటు కంటికి రెప్పలా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒక్కో చెట్టు వేలాది మందికి ఆక్సిజన్ అందిస్తుందని అన్నారు. అలాంటి వేలాది చెట్లను ప్రాజెక్టు పేరుతో హారిస్తే మానవాళి పరిస్థితి ప్రశ్నార్థకం కాదా అని ఆమె ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని కాల రాస్తే ఎలా అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హరితహారం ద్వారా లక్షలాది మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి హరిత శాతాన్ని పెంచారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణం పై వేటు వేసేలా 3000 ఎకరాల ను సేకరించాలనుకోవడం మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడంలా ఉందని ఆమె ఆక్షేపించారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులు మంచిదే కానీ,
ఆ ప్రాజెక్టు మాటను మానవాళి ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తే అంతకంటే మూర్ఖత్వం ఉండదన్నారు.పర్యావరణానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం గురించి ప్రభుత్వ పెద్దలు ఆలోచించి మానవాళికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ ప్రాజెక్టుతో జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అని అన్నారు. వ్యవసాయంపై ఆధారపడ్డ గిరిజనులు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని, అటవీ ప్రాజెక్టు ప్రాంతంపై ఆధారపడి ఎంతోమంది జీవనం సాగిస్తున్నారని, వారి బతుకు అడవుల్లోనే ముడిపడిందని అలాగే అటవీ ప్రాంతాన్ని నిర్మూలించడం అంటే నీటికి అడ్డుకట్ట వేయడమేనన్నారు.మూడు వెల ఎకరాల అడవులను కొట్టివేయడం వల్ల మూసీకి నీరు ఎలా వస్తుందనీ ఆమె ప్రశ్నించారు.ఒక వైపు మూసి ప్రక్షాళన అంటూ ప్రభుత్వం కోట్ల రూపాయలు కుమ్మరించే పనిలో పడిందన్నారు. అసలు పైనుంచి నీరు రాకుండా అడవిని కొట్టివేసి అడ్డుకట్ట వేస్తే మూసిని ఎంతగా ప్రక్షాళన చేసి ఏం ఉపయోగం ఉంటుందని అన్నారు.ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ తో వాతావరణం లో మార్పులు చోటు చేసుకుంటుండగా ఈ ప్రాజెక్టు కారణంగా మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని వాణిదేవి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించి అడుగులు వేయాలని ఆమె సూచించారు.
దామగుండం కాదు అది అగ్నిగుండం…………..పర్యావరణానికి జీవ వైవిధ్యానికి మానవాళికి ఎంతో హాని కలుగుతుంది……….3000 ఎకరాల్లో చెట్లు నేలమట్టం కానున్నాయి……ఇది మానవాళికి ఎంతో ప్రమాదకరం…… ఎమ్మెల్సీ సురభి వాణిదేవి…………
15
Oct