ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ నుండి వచ్చిన సమాచారం మేరకు బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్ప పీడన ప్రభావము తో కురియుచున్న వర్షముల వలన ప్రకాశం జిల్లా లోని అర్ధవీడు, దోర్నాల, కంభం, పెద్దరావీడు , మార్కాపురం, రాచర్ల, ముండ్లమూరు మండలములలో ఈ రోజు అనగా తేదీ :15.10.2024 రాత్రి నుండి ” ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్)” వచ్చుటకు అవకాశం ఉన్నందున ఆయా మండలములలోని ప్రజలందరూ అప్రమత్తముగా ఉండవలేనని మరియు పరిస్థితులను బట్టి అవసరమైనచో మండల అధికారుల ఆదేశముల మేరకు సహాయ శిబిరములకు వెళ్ళి అధికారులకు సహకరించవలసినదిగా జిల్లా కలెక్టరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఒక ప్రకటనలో తెలియ చేసియున్నారు.
